పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ నేతకాని మహర్ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కొత్తపెళ్లి గంగేష్, రాష్ట్ర నాయకులు గబల శ్రీకాంత్ అన్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో పొలాల అమావాస్య పోస్టర్లను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నేతకాని కులస్తులు అత్యంత వైభవంగా సాంస్కృతిక సాంప్రదాయాలను అనుసరిస్తూ జరుపుకునే మహా పండగ పోలాల అమావాస్య అన్నారు. ఈ పండగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండగ గా గుర్తించాలన్నారు. సెప్టెంబర్ 2 పొలాల అమావాస్య సందర్భంగా అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ పాల్గొంటారన్నారు . నేతకాని కులస్తులు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో నేతకాని సంఘ నాయకులు దూల వెంకటేష్, రమేష్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.