పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి

Polala Amavasya festival should be celebrated grandlyనవతెలంగాణ – జన్నారం
సెప్టెంబర్ 2 పోలాల అమావాస్య పండుగను నేతకాని  కులస్తులు ఘనంగా నిర్వహించుకోవాలని నేతకాని కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, తాళ్లపల్లి రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు జాడి గంగాధర్, జన్నారం మండల అధ్యక్షులు, రత్నం లక్ష్మణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకట్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నేతకాని కులస్తుల సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. నేతకాని కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేతకాని కులస్తులు దాదాపు 18 లక్షలు ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం నేతకాని కుల సంఘం తిమ్మాపూర్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  గ్రామ కమిటీ అధ్యక్షులుగా కూకటికారి గంగాధర్, గౌరవ అధ్యక్షులుగా జాడి రాజన్న, ఉపాధ్యక్షులుగా కూకటికారి శ్రీనివాస్, గంధం రాజన్న ప్రధాన కార్యదర్శిగా  జాడి రవీందర్, కోశాధికారిగా మానుక శంకర్, ప్రచార కార్యదర్శిగా గోగు మల్లేష్, సహాయక కార్యదర్శిగా, దర్శనాల కొమురయ్య, గౌరవ సలహాదారులుగా జునుగురి మల్లేష్, పెరుగు మల్లికార్జున్  కామెర శంకర్, కూకటికారి రాజలింగు బోర్లకుంట శంకర్, కూకటికారి శంకర్, జాడి గంగాధర్ దర్శనాల వెంకటస్వామి, జాడి వెంకట్, కామెర చిన్న శంకర్, కార్యవర్గ సభ్యులుగా కామెరా బానయ్య, మాన్క మల్లేష్,  చినుగురి రాజ మల్లయ్య దర్శనాల అశోక్ కామెర కొమురయ్య, జనుగురు తిరుపతి వెంకటేష్,తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.