పొలాల అమావాస్య పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి

Polala Amavasya festival should be celebrated grandly.నవతెలంగాణ – జన్నారం
నేతకాని కులస్తులు అత్యంత వైభవంగా ఘనంగా పొలాల అమావాస్య పండుగను నేతకాని కులస్తులు సోమవారం ఘనంగా నిర్వహించుకోవాలని నేతకాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత, నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, తాళ్లపల్లి రాజేశ్వర్ బోర్లకుంట ప్రభుదాస్ జాడీ గంగాధర్ అన్నారు.  ఆదివారం మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన నేతకాని కులస్తుల సమావేశం నిర్వహించారు.  సందర్భంగా వారు మాట్లాడుతూ నేతకాని కులం, సాంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా  ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నేతకాని సంక్షేమ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకటయ్య, జునుగురి మల్లయ్య, టౌన్ అధ్యక్షుడు దుర్గం వసంత్, నాయకులు బండారి స్వామి దత్తు, దుర్గం నందయ్య అమృత రావు, దుర్గం వినోద్ అల్లూరి వినోద్,బండారి సాగర్, జాడి లచ్చయ్య, తదితర నేతకాని సంఘ నాయకులు పాల్గొన్నారు.