శాంతిభద్రతల పరిరక్షణలో.. పోలీసులు నంబర్‌వన్‌

– ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
– జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
నారాయణపేట టౌన్‌ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తు న్నారని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు సురక్ష దినోత్సవం సంద ర్భంగా ఎస్పీ కార్యాలయం నుంచి పోలీసులు, విద్యార్థులు, యువకులు, పోలీస్‌ వాహనాలతో ఏర్పాటు చేసిన భారీ ర్యాలీని మక్తల్‌ ఎ మ్మెల్యే, ఎస్పీ ఎన్‌. వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారం భించారు. ఈ ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి ఆర్డీవో ఆఫీస్‌, సావర్కర్‌ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా మీదుగా అంబేద్కర్‌ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందా లంటే శాంతిభద్రతలు ఎంతో అవసరమని అన్నారు. అప్పుడే పారిశ్రామికంగా పెట్టుబడులను ఆకర్షిం చేందుకు వీలుం టుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు సమ కూరుస్తున్న అధునాతన వసతులతో తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. నేటి సమాజంలో కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు చోటుచేసుకుంటుండగా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పోలీసులు సైతం నేరాల నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఎస్పీ ఎన్‌. వెంకటేశ్వర్లు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ను ప్రారంభించారు. అందులో పోలీసులు ఉపయో గించే ఆయుధాలు, షీ టీం పోలీసులు, కళాబందం వారు ప్రజలకు అవగాహన కల్పించారు. దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు పట్టుకోవడానికి ఫింగర్‌ ప్రింట్స్‌ యూనిట్‌ ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలను, ఐటీ కోర్‌ టీం నూ తన టెక్నాలజీ ఉపయోగించే విధానం, జిల్లాలో పోలీసులు వైర్లెస్‌ కమ్యూనికేషన్‌ జరిపే విధానం, మాదకద్రవ్యాలు పట్టుకోవడనికి, దొంగతనాల నిర్మూలనకు ట్రైనింగ్‌ పొందిన డాగ్స్‌, బాంబు డిస్పోజల్‌ టీం పరికరాలు, జిల్లా పోలీస్‌ ఉపయోగించే వాహనాలు, పెట్రోల్‌ కార్‌ వాహ నాలు, ట్రాఫిక్‌ పోలీసులు ఉపయోగించే పరికరాలు తదితర స్టాల్స్‌ను ఎస్పీ ప్రారంభించి వీక్షించారు. అనంతరం ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు సురక్ష దినోత్సవం నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాన్ని సమర్థవంతమైన సేవలను వివరించే విధంగా నారాయణపేట జిల్లాలో పోలీసులు ఉపయోగించే వివిధ టెక్నాలజీనీ, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ వింగ్‌ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ ను నియంత్రించడం జరుగుతుందన్నారు. షీ టీమ్‌, పోలీస్‌ కళాబదం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, క్లూస్‌ టీం, ఐటీ కోర్‌ టీం ద్వారా ఆధు నిక టెక్నాలజీ ఉపయోగించి దొంగతనాలు జరిగినప్పుడు టెక్నాలజీ ఆధారంగా దొంగలను పట్టుకోవడం జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలవకుండా నిరంతరం వృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీలు కే సత్యనారాయణ, వెంకటే శ్వర రావు, సీఐ లు రవి బాబు, సీతయ్య, శ్రీకాంత్‌ రెడ్డి, జనార్ధన్‌, ఎస్‌ఐలు, పోలిసు సిబ్బంది, విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ధరూర్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా సురక్ష దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం పోలీసు పెట్రోకార్స్‌, బ్లూ కొల్ట్స్‌ వాహన ర్యాలీని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి అలంపూర్‌ ఎమ్మెల్యే వీ.ఎం.అబ్రహం.. జిల్లా ఎస్పీ సజన ర్యాలీ ప్రారంభించి, శాంతి కపోతాలను ఎగుర వేశారు. ఈ కార్యక్ర మంలో డీఎస్పీ,సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.