
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి.లక్ష్మినర్సయ్య ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయస్థానముల సముదాయంలో కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సన్హిత్ 2023, భారతీయ నాగరిక్ సురక్షా సన్హెత్ 2023, భారతీయ సాక్ష అధినియం 2023 లపై నిజామాబాద్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యం.డి. రహిమోద్దిన్ , డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మినర్సయ్య లు క్లుప్తంగా అవగాహణ కల్పించారు. నేర పరిశోధనలో పోలీసు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన చట్టాలను అవలంభించి నేరస్తులకు శిక్షపడేటట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వారి యొక్క పరిధిలోని పోలీసు వారికి సలహాలు ఇవ్వాలని డిప్యూటి డైరెక్టర్ లక్ష్మీనర్సయ్య కోరారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మినర్సయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీసు రాజేశ్వర్, బంటు వసంత్, రాజారెడ్డి, నిజామాబాద్ డివిజన్లోని పోలీసు అధికారులు, పోలీస్ ఇన్స్పెక్టర్లు కోర్టు ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.