క్షతగాత్రుడిని వాహనంలో తరలిస్తున్న పోలీసులు

 – మానవత్వం చాటుకున్న పోలీసులు
నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్:
ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తమ వాహనంలో పోలీస్ అధికారులు మధుకర్ యాదగిరి లు ఆసుపత్రికి తరలించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.తంగళ్ళపల్లి మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన వ్యక్తి సిరిసిల్ల నుండి తన గ్రామానికి వెళ్తున్న సమయంలో జెడ్పీ కార్యాలయం ముందు ప్రమాదవశాత్తు  ద్విచక్ర వాహనం స్కిడ్ అయి డివైడర్ కు గుద్దుకొని కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి లు తన సిబ్బంది సహాయంతో తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.