
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులోని ఓ రైస్ మిల్లు నుండి ఏపీ 24 టీ బీ1119 నెంబరు గల లారీలో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని కొంతమంది వ్యక్తులు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో గురువారం బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీలో 29 టన్నుల బియ్యం ఉన్నట్లు,సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూరు గ్రామంలోని శ్రీ నిది ఇండస్ట్రీస్ నుండి హన్మకొండ జిల్లా కాజీపేట వరకు డెలివరి కోసం చలాన్ లో అనుమతులు ఉండగా లారీ డ్రైవర్ మాత్రం చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో గతంలో పలు ఆరోపణల తో మూతపడిన ఓ రైస్ మిల్లు నుండి లోడుచేసుకొని తీసుకొస్తున్నట్లు చెప్పడంతో పలు అనుమానాలకు తావిస్తుంది.అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నది వాస్తవమేనని, లారీ లోని బియ్యం పై విచారణకు,తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ (పౌర సరఫరాలు)కు సమాచారం ఇచ్చినట్లు తహసీల్దార్ మహమ్మద్ సమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు.