బాబ్జీ దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మిస్తున్న చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. ఈ చిత్రం ప్రస్తుతం పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘రవి కాలె, అజరు ఘోష్, సంజరు నాయర్, అఖిల్ సన్నీలతో పాటు హీరో, హీరోయిన్‌ల బందం పై టాలీవుడ్ స్టూడియో, చిత్రమందిర్ స్టూడియో, చందానగర్, బీరంగూడా, ఘణ పూర్, షామీర్ పేట్‌ల్లో భారీగా వేసిన సెట్స్‌లో ఫైట్ మాస్టర్ ‘సింధూరం’ సతీష్ నేతత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరించాం. అక్టోబర్ 23న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌తో 80 శాతం టాకీ పార్ట్‌తో పాటు పోరాట సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయ్యింది. జనవరి నెలాఖరు నాటికి మిగతా సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణను కూడా పూర్తి చేస్తాం’ అని దర్శకుడు బాబ్జీ తెలిపారు. నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ, ‘క్రమశిక్షణతో ఉన్న ఈ రంగంలో పొందిన స్పూర్తితో భవిష్యత్‌లో కూడా సినిమాల నిర్మాణాన్ని ఇలాగే కొనసాగిస్తాను’ అని అన్నారు.