
ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఆళ్ళపల్లి మండలం అనంతోగు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా పినపాక నియోజకవర్గం ఏమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని శనివారం ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీ నిర్వహణాకు గాను ఏమ్మెల్యే తన వాహనం దిగి పోలీసులకు సహకరించారు. ఈ తనిఖీలలో హెడ్ కానిస్టేబుల్ వేములపల్లి రాజేశ్వరరావు, కానిస్టేబుల్ యండ్రాతి శ్రీనివాస రావు, టీఎస్ఎస్ పీ సిబ్బంది పాల్గొన్నారు.