
నిజామాబాద్ సైబర్ నేరాల గురించి వుట్ ఆన్ హోల్డ్ కేసులలో స్టాండడ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలో టి.ఎస్.సి.ఎస్.బి డైరెక్టర్ షికాగోయల్, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ యందు విధులు నిర్వహించే సైబర్ వారియర్స్ సిబ్బందికి అవగాహణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిదులుగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్., హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్ స్టేషన్కు సైబర్ నేరానికి సంబంధించిన ధరఖాస్తురాగానే వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని, ఫిర్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరియు ఎలాంటి సైబర్ నేరం జరిగింది, ఏ నెంబర్ నుండి ఫోన్ వచ్చింది, ఫిర్యాదికి సంబంధించిన ఫోన్ నెంబర్ , ఈ-మెయిల్ ఐడి తదితర అంశాలు ఎఫ్.ఐ.ఆర్ యందు నిక్షిప్తం చేయాలని సూచించారు. సైబర్ నేరాలు జరగకుండా ప్రతీ రోజు ప్రజలకు అవగాహన కల్పించాలని సోషల్ మీడియాలో వాట్సప్ గ్రూప్లలో సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయాలని సూచించారు.సైబర్ క్రైమ్ ద్వారా ఆర్థికంగా నష్టపోయిన బాధితులు ముందుగా నేషనల్ క్రైమ్ విభాగం హెల్ప్ లైన్ నెంబర్ 1930 సమాచారం అందజేయడం ద్వారా బాధితులకు సత్వరమే అందించే న్యాయం పై పోలీస్ స్టేషన్ అధికారులు ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా సంబంధిత బాధితుల ఖాతాల నుండి సైబర్ నేరగాళ్లు డబ్బును మల్లిoచబడిన ఖాతాలకు సంబంధించిన లావాదేవిలను పూర్తిగా నిలుపుదల చేయబడుతుందని ఈ విధంగా సైబర్ నేరగాళ్ల ఖాతాలకు మళ్లించబడిన డబ్బు తిరిగి బాధితులకు అందజేసేందుకుగాను పోలీస్ స్టేషన్ స్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన బాధ్యతల గురించి క్షుణ్ణంగా తెలియజేశారు.బాధితులు నష్టపోయిన డబ్బు తిరిగి బాధితులకు వచ్చేందుకు పోలీస్ అధికారులు జరపాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించి అంశాలతోపాటు వాట్సప్ , ఫేస్ బుక్ , ఇన్స్టిమ్ , యూ ట్యూబ్ , ట్విట్టర్ లాంటి సామాజిక మాద్యమాల వేదికగా సైబర్ మోసాలకు సంబంధించి నమోదయిన కేసుల్లో సైబర్ నేరగాళ్లను గుర్తించడంతో పాటు బాధితులకు న్యాయం చేయడంలో స్టేషన్ పరిధిలో ముందస్తుగా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ అవగాహణ కార్యక్రమం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డి.యస్.పి వేణుగోపాల్ రెడ్డి, సి.ఐ శ్రీ ముఖీద్ పాష్యా, ఎస్. ఐ పూర్ణేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.