నిజామాబాద్ లో సత్ఫలితాలు ఇస్తున్న షీ  టీమ్: పోలీస్ కమీషనర్ వెల్లడి

నవతెలంగాణ -కంటేశ్వర్
ఎవరైన ఆకతాయిలు విధ్యార్ధులను మహిళలను వేధింపులకు గురి చేసినట్లయితే వారి పట్ల కఠినచర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ,ఐ.పి.యస్., మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోగల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ యందు షీ టీమ్ బృందాలను నిఘా ఉంచామని ఎవ్వరయిన మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వేదింపులకు గురిచేసినట్లయితే షీ టీమ్ సెల్ నెంబర్  8712659795 గాని లేదా డయల్ 100 గాని ఫోన్ చేసి తెలి యజేయగలరని పేర్కొన్నారు.ప్రస్తుత అనగా తేది: 01-09-2023 నుండి తేది: 30-09-2023 వరకు నిజామాబాద్ కమిషనరేట్ లోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోగల షీ టీమ్స్ ద్వారా పట్టుబడిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ లో 06 సంఘటనలు, ఆర్మూర్ లో 02 సంఘటనలు, బోధనలో 02 సంఘటనలు, మొత్తం 10 సంఘటనలు జరిగినవి.
 నిజామాబాదులో పట్టుబడిన వారు 07, ఆర్మూర్ లో పట్టుబడిన వారు 02, బోధనలో పట్టుబడిన వారు 03,మొత్తం పట్టుబడిన వారు 12, నిజామాబాదులో పెట్టి కేసులు 05 ,ఆర్మూర్ లో పెట్టి కేసులు 02, బోధన్ లో పెట్టి కేసులు02,మొత్తం పెట్టి కేసులు 09, నిజామాబాద్, ఆర్మూర్ ,బోధన్, లలో ఎఫ్.ఐ.ఆర్, లు నమోదు కాలేవు. నిజామాబాదులో కౌన్సిలింగ్ చేయబడిన వారు 01, ఆర్మూర్, బోధన్, లో కౌన్సిలింగ్ చేయబడిన వారు లేరు. మొత్తం కౌన్సెలింగ్ చేయబడిన వారు  01 అని తెలియజేశారు.