ఆపరేషన్ ముస్కాన్  X వివరములు వెల్లడించిన పోలీస్ కమిషనర్

Police Commissioner Reveals Operation Muskan X Detailsనవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ -X కార్యక్రమం తేది  01-07-2024 నుండి తేది: 31-07-2024 వరకు కొనసాగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్, ఐ.పి.యస్. శనివారం తెలియజేశారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ ముఖ్య ఉద్దేశ్యం 18  సo!! వయస్సు లలోపు తప్పిపోయిన / వదిలివేయబడిన / కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి, వారితో పనిచేయిం చిని యాజమానిపై కేసు నమోదు చేయడం కాని లేదా వారి తల్లి దండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించడం కాని, తల్లి దండ్రులు లేని వారిని చైల్డ్ వెల్సేర్ కమిటి ( సి.డబ్ల్యూ.సి ) వారికి అప్పజెప్పడం జరుగుతుంది అని తెలియజేశారు. అలాగే తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని చైల్డ్ వెల్సేర్ కమిటి ముందు హజరుపరిచి, వారి ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ ఆపరేషన్ ముస్కాన్-Xలో నిజామాబాద్ కమిషనరేటు పరిధిలో గల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 74 మంది పిల్లలను పట్టుకోవడం జరిగింది. అలాగే కమీషనరేటు పరిదిలో 5 ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగింది. ఇందులో నిజామాబాద్ డివిజన్ నందు నాలుగవ పోలీస్ స్టేషన్ యందు ఒకరిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నందు ఒకరిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఆర్మూర్ డివిజన్ నందు బాల్కొండ పోలీస్ స్టేషన్ లో ఒకరి పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినట్లు, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ యందు ఒకరి పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగింది. అలాగే బోధన్ డివిజన్ నందు వర్ని పోలీస్ స్టేషన్ నందు ఒకరి పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగింది అని తెలియజేశారు. అలాగే తప్పిపోయిన పిల్లల వివరాలను దర్పన్ యాప్ లో నమోదు చేసి వారి అడ్రస్ లను గుర్తించడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ ఆపరేషన్ ముస్కాన్ X లో పట్టుకున్న పిల్లల వివరాలు నిజామాబాద్ సబ్ డివిజన్ వారీగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 26, ఆర్మూర్ సబ్ డివిజన్ వారీగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 15,బోధన్ సబ్ డివిజన్ వారీగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 33 గా గుర్తించగా మొత్తం సబ్ డివిజన్ ల వారిగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 74 ఉందని తెలియజేశారు.