రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమీషనర్

నవతెలంగాణ- కంటేశ్వర్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినముల సందర్భంగా (పోలీస్ ఫ్లాగ్ డే) బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని ప్రశాంతి నిలయం యందు రక్తదాన శిభిరం  కార్యాక్రమం ఉదయం 11 గంటలకు నిర్వహించగా ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ శింగెనవార్, ఐ.పి.యస్ హాజరయ్యారు.ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 27 మంది పోలీస్ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ( ఎ.ఆర్) గిరిరాజు, నిజామాబాద్ ఎ.సి.పి కిరణ్ కుమార్, రిజర్వు ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, జిల్లా ప్రభుత్వ హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఉమాదేవి ( పాథాలజిస్టు), డాక్టర్ ఇమ్రాన్ అలి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.