మాజీ మంత్రి నారాయణపై పోలీసులకు ఫిర్యాదు

– తనను వేధిస్తున్నారని తమ్ముడి భార్య ఆరోపణ
నవతెలంగాణ- మియాపూర్‌
ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియాపొంగుళూరు ఆదివారం హైదరాబాద్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు కొన్నేండ్ల నుంచి తనను మానసికంగా,శారీరకంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా బావ నారాయణ తనను మానసికంగా హింసిస్తూ. శారీరకంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసినట్టు ఆమె మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ విషయంపై కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రియా పొంగుళూరు తనకు జరిగిన అన్యాయంపై సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా. దాన్ని ఆ మె భర్త ఖండిస్తూ పోస్టు చేశాడు. ఈ క్రమంలో ఆమె రాయదుర్గం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.