గుండెపోటుతో పోలీస్ కానిస్టేబుల్ మృతి 

– పార్దివ దేహమునకు గౌరవ వందనం చేసిన పోలీసు అధికారులు

నవతెలంగాణ-హలియా : హాలియా మున్సిపాలిటీ అలీ నగర్ రెండో వార్డుకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు, పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే మొహమ్మద్ నజీర్ (38)ఈరోజు ఉదయం అకస్మాత్తుగా గుండె నొప్పితో నల్గొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం జరిగినది భౌతికయాన్ని తన స్వగృహమునకు తీసుకొచ్చిన తదనంతరం ప్రభుత్వ పరంగా పోలీస్ అధికారులచే గౌరవ వందనం చేసి ఘనంగా నివాళులు అర్పించారు