సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఎస్సై సాయికుమార్ ఆధ్వర్యంలో కళాబృందం చేత ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాబృందం వారు విద్యార్థినీ విద్యార్థులు ఈతకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే షీ టీం కు సమాచారం అందించాలని, సైబర్ నేరాల బారిన పడకుండా స్మార్ట్ ఫోన్ లో వచ్చే ఓటీపీలు, మోసపూరితమైన యాప్స్ లను ఇన్‌స్టాల్ చేయవద్దని సూచించారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాబృందం సభ్యులు ప్రభాకర్, సాయిలు, శేషారావు, షీ టీం బృందం, పీసీ భూమయ్య, రాజేందర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.