నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఊర పండగకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ప్రతిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఊర పండగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద, ప్రధాన ఆలయాల వద్ద పోలీసులు నిఘా ను ఏర్పాటు చేశారు. పండగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఊర పండగ ప్రారంభమైన రోడ్డు మార్గంలో నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ, తో పాటు నిజామాబాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, నగర సిఐ నరహరి, సిఐలు, ఎస్ఐలు కానిస్టేబుళ్లు పోలీస్ సిబ్బంది మహిళ పోలీసులు పెద్ద సంఖ్యలో ర్యాలీ గుండ బందోబస్తులో పాల్గొన్నారు. ఊర పండగ సందర్భంగా బందోబస్తుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు పోలీస్ శాఖ తరఫున తెలియజేశారు.