– ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్
నవతెలంగాణ-మహబూబ్ నగర్
పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నదని ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్ తెలిపారు.జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు మంగళవారం రిజర్వ్ పోలీస్ సిబ్బందితో జిల్లా కేంద్రం లోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఏ.ఆర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగినా ప్రజలలో భరోసా, ధైర్యం కల్పించడం లక్ష్యంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నదని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసే పోలీసులకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. ఈ కవాతు తెలంగాణ చౌరస్తా, బస్టాండ్, మల్లికార్జున ఎక్స్ రోడ్, న్యూటౌన్,గవర్నమెంట్ ఆస్పత్రి మీదుగా మెట్టుగడ్డ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ స్వామి, టూ టౌన్ ఎస్‌ఐ సిబ్బంది పాల్గొన్నారు.