60 మంది పిల్లల్ని పట్టుకున్న పోలీసులు..

Police arrested 60 children– కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
–  ఆపరేషన్ స్మైల్ – XI వివరములు వెల్లడించిన ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో జనవరి 01 2025 నుండి జనవరి 31 వరకు ఆపరేషన్ స్మైల్ – XI కొనసాగిందని నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సి.హెచ్. సింధు శర్మ, ఐ.పి.యస్. తెలియజేశారు.ఈ ఆపరేషన్ స్మైల్ -Xl ముఖ్య ఉద్దేశ్యం 18 సంవత్సరాలోపు తప్పిపోయిన, వదిలివేయబడిన కార్మీకు లుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి, వారితో పని చేయించిన యాజమానిపై కేసు నమోదు చేయడం కాని లేదా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించడం కాని, తల్లి దండ్రులు లేని వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటి (సి.డబ్ల్యూ.సి) వారికి అప్పజెప్పడం జరుగుతుంది అని తెలియజేశారు. ఈ ఆపరేషన్ స్మైల్ – XI లో భాగంగా నిజామాబాద్ కమీషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ లో మొత్తం 60 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో నిజామాబాద్ డివిజన్ నందు రెండవ పోలీస్ స్టేషన్ నందు ఒక్క యజమాని పై, ఆర్మూర్ డివిజన్ నందు నందిపేట్ పోలీస్ స్టేషన్ నందు ఒక్క యజమానిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగింది. మిగిత పిల్లల్ని సి.డబ్ల్యూ.సి వారి ఆదేశాల మేరకు వారి వారి తల్లిదండ్రులకు అప్పజెప్పడం జరిగిందన్నారు. అలాగే తప్పిపోయిన పిల్లల వివరాలను దర్సన్ యాప్ నమోదు చేసి వారి అడ్రస్ లను గుర్తించడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ ఆపరేషన్ స్మైల్ -Xl లో పట్టుకున్న పిల్లల వివరాలు తెలియజేశారు. నిజామాబాద్ సబ్ డివిజన్ వారిగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 21,ఆర్మూర్ సబ్ డివిజన్ వారీగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 16, బోధన్ సబ్ డివిజన్ వారిగా గుర్తించిన బాలల వివరాల సంఖ్య 23, మూడు సబ్ డివిజన్ ల వారీగా గుర్తించిన బాలల మొత్తం వివరాల సంఖ్య 60 గా గుర్తించామన్నారు. వీరికి నిజామాబాద్ సబ్ డివిజన్ లో కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన వివరాలు సంఖ్య 21, ఆర్మూర్ సబ్ డివిజన్ లో కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన వివరాల సంఖ్య 16, బోధన్ సబ్ డివిజన్ లో కౌన్సిలింగ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన వివరాల సంఖ్య 23, మొత్తం మూడు సబ్ డివిజన్ లో కౌన్సిలింగ్ చేసి 60 మందిని వారి కుటుంబ సభ్యులకు అందజేసామని వివరించారు.