సూపర్ మార్కెట్ దొంగలను పట్టుకున్న పోలీసులు ..

Police caught supermarket thieves..నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్ చౌరస్తా సమీపంలో ఉన్న విజయ సూపర్ మార్కెట్ నందు, గత వారం కిందట జరిగిన దొంగతనం కేసు నందు నేరస్థులైన లంబాడి దేవ సోత్ రాజు, లంబాడి బుట్ట రాజు, మెదక్ జిల్లా టేక్మల్ గ్రామానికి చెందిన  ఇద్దరు పాత నేరస్తులను పట్టుకోవడం జరిగిందనీ పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇట్టి వ్యక్తులను విచారణ చేయగా వీరు పాత నేరస్తులు, లోగడ పాపన్నపేట్, టేక్మాల్, మెదక్, నర్సాపూర్ సంగారెడ్డి మొదలగు పోలీస్స్టేషన్ ల పరిధిలో దొంగతనాలు చేసి, జైలుకు వెళ్లి, ఈ మధ్యలోనే జనవరి నెలలో జైలు నుండి రిలీజ్ అయి, ఆ తర్వాత తిరిగి దొంగతనాలు చేయు ఉద్దేశ్యంతో, కామారెడ్డిలో, తూఫ్రాన్ లో గోడలకు కన్నం వేసి దొంగతనాలు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, ఒక గడ్డపార, 2 ఫోన్లను స్వాధీనపరచుకొని,  న్యాయస్థానం నందు హాజరు పరిచి, జైలుకు పంపడం జరిగిందన్నారు. ఈ కేసు నందు చాక చాఖ్యముగా వ్యవహరించిన ఎస్సై  సిబ్బందిని అభినందించడం జరిగిందన్నారు.