ఇద్దరు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పట్టుకున్న పోలీసులు

Police arrested two people who were supplying marijuanaనవతెలంగాణ – ఆర్మూర్
నిర్మల్ నుండి ఆర్మూర్ వైపు వస్తున్న జాతీయ రహదారి 44 పోచంపాడు వద్ద వద్ద ఎండు గంజాయి తో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ గురువారం తెలిపారు. ఎస్సై B. చంద్రమౌళి సిబ్బందితో కలిసి రూట్ వాచ్ నిర్వహిస్తుండగా నేరడిగొండ మండలంలోని లింగట్ల గ్రామానికి చెందిన సబ్లె ప్రకాష్ , బరదవల్ గవస్కర్ లు కలిసి అక్రమంగా ద్విచక్ర వాహనంపై ఎండు గంజాయిని రవాణా చేస్తూ ఉండగా,ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై ఉన్నటువంటి సంచిలో ఎండు గంజాయి లభించినది. అని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని ని విచారించగా నేరేడుగొండ ( ఆదిలాబాద్ జిల్లా) నుండి గుర్తు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు పోచంపాడ్ లో యువకులకు విక్రయిస్తున్నాము అని తెలిపినారు. గంజాయిని అక్రమంగా రవాణా చేయడం అమ్మడం నేరమని తెలిపి వారి వద్దనుండి (1.300)kg ల ఎండు గంజాయిని, ఒక బజాజ్ పల్సర్150 బైక్, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్ నుండి ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నేరస్థులపై గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది . యువత ఎండు గంజాయిని సేవిస్తూ దురలవాట్లకు బానిస కాకూడదని, అక్రమంగా ఎండు గంజాయిని రవాణా చేయడం కానీ,కలిగి ఉండడం కానీ నేరమని అట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ స్టీవెన్సన్ అన్నారు. ఈ దాడిలో ఎస్సై చంద్రమౌళి సిబ్బంది.సాయిలు,వికాస్ గౌడ్,సందీప్,నరేష్, ధర్మేందేర్,శ్రీనివాస్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.