హిట్లర్‌ కోసం పోలీసుల వేట

Police Hunt for Hitlerపలు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టు కుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా ‘హిట్లర్‌’తో మరోసారి ఆడియెన్స్‌ ముందుకు రాబోతున్నారు. గతంలో విజయ్ ఆంటోనీతో ‘విజయ్ రాఘవన్‌’ చిత్రాన్ని నిర్మించిన చెందూర్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను నిర్మించింది. డీటీ రాజా, డీఆర్‌ సంజయ్ కుమార్‌ నిర్మాతలు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు ధన ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ ప్రపంచంలో నిజమైన పవర్‌ అనేది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్‌ గెటప్స్‌లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్‌ కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్‌ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకి ఉన్న రొమాంటిక్‌ లవ్‌ స్టోరీని ట్రైలర్‌లో రివీల్‌ చేశారు. దశాబ్దాలుగా రాజకీయ క్రీడలో ఆరితేరిన ఓ స్వార్థపూరిత నాయకుడి పాత్రలో చరణ్‌ రాజ్‌ కనిపిస్తారు. పొలిటికల్‌ డ్రామా, యాక్షన్‌, లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్‌ ఇంప్రెస్‌ చేస్తోంది. విజయ్ ఆంటోనీ పర్‌ఫార్మెన్స్‌, రిచ్‌ ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కెమెరా వర్క్‌ ట్రైలర్‌కు హైలెట్స్‌గా నిలుస్తున్నాయి. విజయ్ ఆంటోనీ కెరీర్‌లో ఈ సినిమా మరో వైవిధ్యమైన చిత్రంగా నిలుస్తుందని, ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే ఆశాభావాన్ని మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌ ఆంటోనీ, రియా సుమన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ నటించిన ఈ చిత్రానికి కెమెరా – ననీన్‌ కుమార్‌.ఐ, సంగీతం- వివేక్‌, మెర్విన్‌, ఆర్ట్‌ – సి.ఉదయ్ కుమార్‌, ఎడిటింగ్‌ – సంగతమిజాన్‌.ఇ, కొరియోగ్రఫీ – బృందా, లీలావతి, స్టంట్స్‌ – జి.మురళి, ప్రొడ్యూసర్స్‌ – డీటీ రాజా, డీఆర్‌ సంజయ్ కుమార్‌, రచన, దర్శకత్వం – ధన.