ఢీకొట్టి పారిపోయిన వాహనాన్ని గుర్తించిన పోలీసులు

– సీఐ, ఎస్ఐ లను అభినందించిన ఏసిపి ఎల్ జీవన్ రెడ్డి,
నవతెలంగాణ- శంకరపట్నం 
ఈనెల 16న మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో ఉదయం జాతీయ రహదారిపై సైకిల్ పై వెళ్తున్న మల్యాల శ్రీనివాస్ (40)ను వెనుక నుండి ఢీ కొట్టి పారిపోగా శ్రీనివాస్ అక్కడికక్కడ మృతి చెందిన ఘటనలో కేశవపట్నం పోలీసులు ఆ వాహనాన్ని కనుగొన్నారు.ఈ సందర్భంగా స్థానిక కేశవపట్నం పోలీస్స్టేషన్లో హుజురాబాద్ ఏసిపిఎల్ జీవన్ రెడ్డి, శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు హుజురాబాద్ సిఐ సంతోష్ కుమార్, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి,ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి లభించిన ఆధారాలతో సీసీ ఫుటేజ్ ద్వారా మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం పులిమడుగు గ్రామానికి చెందిన వాహన డ్రైవర్ అజ్మీర కళ్యాణ్ అతివేగంగా అజాగ్రత్తగా వాహనం టీఎస్ 07 యుఎల్ 1042 మహీంద్రా జీతో ప్లస్ ట్రాలీ ఆటోగా గుర్తించామని వెల్లడించారు.  త్వరలో వాహనాన్ని స్వాధీనం చేసుకొని డ్రైవర్ని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. హుజరాబాద్ సిఐ బి. సంతోష్ కుమార్, కేశవపట్నం ఎస్సై పాకాల లక్ష్మారెడ్డిలను ఏసిపి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం వాహన డ్రైవర్లకు సూచన కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఏసీపి జీవన్ రెడ్డి ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో తాము జాగ్రత్తగా నడిపి తమ వాహనంతో ప్రమాదం జరిగి, ఎదుటి వారికి గాయాలు కలిగిన, మరణం సంభవించిన రోడ్డుపైన  భయపడి పారిపోకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలి లేదా లొంగి పోవాలని సూచించారు. దాని వలన పోలీసులకు సమాచారం తెలిసి క్షతగాత్రులను త్వరగా ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని, అలాగే ఢీ కొట్టిన వారికి శిక్షకూడా తగ్గించబడుతుందని వాహన డ్రైవర్లకు సూచించారు.