నవతెలంగాణ – ఆర్మూర్
నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన అవసరమని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి రామకృష్ణ అన్నారు. కోర్ట్ సముదాయంలో శనివారము పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. రామకృష్ణ అధ్యక్షతన నూతన చట్టాల పై సమీక్ష సమావేశము నిర్వహించరు. భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక సురక్ష సంహిత,భారతీయ సాక్ష్య అధినియం 2023 పై పోలీస్ అధికారులకు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నేర దర్యాప్తు లో పోలీసులకు మెళుకువలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్య నారాయణ,డిచ్పల్లి సీఐ మల్లేష్, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, భీంగల్ సీఐ నవీన్ కుమార్,డివిజన్ లోని అన్ని పోలీసు స్టేషన్ ల ఎస్ఐ లు రాము,అనిల్,నరేష్,మహేష్,రాము,రజినీకాంత్ నారాయణ,తిరుపతి,చిరంజీవి కోర్ట్ లైజెన్ అధికారి యాదగిరి,ఎక్సయిజ్ , కోర్ట్ డ్యూటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.