మండల కేంద్రంలో పోలీసుల కవాతు

నవతెలంగాణ – నాంపల్లి: రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడం కోసం నాంపల్లి మండలానికి వచ్చిన ఐటి బిపిఎఫ్ బలగాలతో నాంపల్లి పోలీసులు మండల కేంద్రంలో కవాతు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు రక్షణ కల్పించడానికి మేమున్నాము అని తెలియజేస్తూ  భరోసా కల్పించడమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశమని నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ కె. లచ్చిరెడ్డి తెలిపారు.