బస్తర్‌ రేంజ్‌లో పోలీసుల పాగా

Police raid in Bastar range– బీజాపూర్‌, సుక్మా, దంతవాడ జిల్లాలను హస్తగతం చేసుకున్న పోలీసులు
– మడవి హిడ్మా ఇంట్లో పోలీసులు సంచారం
– పువర్తి దండకారణ్యంలో యుద్ధమేఘాలు
– నివురుకప్పిన నిప్పులా గ్రామం
– పువర్తిలో భారీ స్మారక స్తూపం కూల్చివేత
నవతెలంగాణ-చర్ల
ఒకప్పుడు మావోయిస్టుల హెడ్‌ క్వార్టర్‌గా పేరొందిన పువర్తిలో పోలీస్‌ శిబిరం ఏర్పాటు చేసి మావోయిస్టులకు పోలీసులు సవాల్‌ విసిరారు. నాడు విప్లవ గేయాలు, లాల్‌ సలామ్‌ పాటలు విన్న ఆదివాసీ జనం నేడు సారే జహా సే అచ్చా హిందూస్తాన్‌ హమారా.. అని పాడుతున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. నాడు మావోయిస్టు బందూకులు చూసిన జనం నేడు సైనికులకు కరచాలనం చేస్తున్నారు. పూర్తి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే 14 పోలీసు శిబిరాలను ఏర్పాటు చేసి అడుగడుగు నా దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. సైతం మావోయిస్టుల నిర్మూలన విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కిలో మీటరు కు ఒక పోలీసు క్యాంప్‌ ఏర్పాటు చేసి కొండా కోనల్లోకి జొరపడటంతో మావోయిస్టులు దిక్కు తోచ ని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
దక్షిణ బస్తర్‌ బీజాపూర్‌, సుక్మా, దంతేవాడ జిల్లాలో కొత్త క్యాంపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ మావోయి స్టులు పోలీస్‌ క్యాంపులపై వరుస దాడులకు పాల్పడినా వెనకడుగు వేయకుండా పోలీసులు ముందుకు దూసుకొని పోవడంతో మావోయిస్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరిహద్దు ఛత్తీస్‌ గఢ్‌ బీజాపూర్‌ జిల్లా దర్మారం క్యాంప్‌పై మావోయిస్టులు బుధవారం సాయం త్రం ఆరు గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 5 గంటల వరకు కాల్పులు జరిపారు. దాదాపు వెయ్యి యూబీజీఎల్‌లతో కాల్పులు జర పగా అందులో సగం పేలలేదు. లాంచర్లను పామేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూబీజీఎల్‌లతో మావోయిస్టులు జరిపిన కాల్పులను భద్రతా బలగాలు తిప్పి కొట్టారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు ఆ పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
టేకులగూడెం వద్ద క్యాంప్‌ ఏర్పాటు చేసిన తర్వాత మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా మరి కొంతమంది గాయపడ్డారు. బీజాపూర్‌ జిల్లా గుండంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌పై మావోయిస్టులు యూబీజీఎల్‌లతో కాల్పులు జరి పారు. దాన్ని తిప్పికొట్టడంతోపాటు సైనికులకు హాని కలిగించేలా మావోయిస్టులు ఏర్పాటు చేసిన 11 ఐఈడీ బాంబులను బీడీఎస్‌ బృందాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. పోలీసు బలగాల గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో మావోయిస్టులు తమ స్థావరాలను ఎప్పటి కప్పుడు మార్చుకునే పరిస్థితి నెలకొంది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మడివి హిడ్మా స్వగ్రామం పువర్తిలో పోలీస్‌ శిబిరం ఏర్పాటు చేసిన 48 గంటల్లో 7 సార్లు మావోయిస్టు లు కాల్పులు జరపగా పోలీసులు తిప్పి కొట్టి తమ సత్తా ఏంటో చూపించారు. హిడ్మా గడ్డ నేడు పోలీసు అడ్డాగా మారింది. రానున్న రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో మావో యిస్టులపై పోలీసులు మరింత ఉక్కుపాదం మోపి నిర్మూలన విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పువర్తిలో భారీ మావోయిస్టు స్మారక స్తూపం కూల్చివేత
మావోయిస్టు పార్టీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన అమరులను స్మరించుకుంటూ పువర్తిలో నిర్మిం చిన భారీ స్మారక స్థూపాన్ని పోలీసులు కుప్పకూల్చారు. ఈ స్మారక స్థూపం కోటి రూపాయల రివార్డు కలిగి మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా తమ్ముడు మాడవి నందలాల్‌ జ్ఞాపకార్థంగా నిర్మించిన స్థూపం కావడం ఇక్కడ విశేషం. పువర్తిలో పీఎల్‌ జీఏ మొదటి బెటాలి యన్‌ కమాండర్‌ హిడ్మా కార్యకలా పాలు నిర్వహించే గెస్ట్‌హౌస్‌ పక్కనే మడవి నందా ల్మ, మడవిహుంగాల జ్ఞాపకార్థం నిర్మించి ఉన్న ఈ భారీ స్థూపాన్ని పోలీసులు నేలమట్టం చేశారు.