పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Police raid on poker baseనవతెలంగాణ – పిట్లం: పేకాట స్థావరంపై పక్క నిఘాతో పోలీసులు దాడులు జరిపి భారీగా నగదు స్వాధీనపరచుకొని, మాజీ ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన ఉదాంతం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. శుక్ర వారం రాత్రి అందాజా 12 గంటల సమయంలో మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ లో గత కొంతకాలంగా పేకాట నిర్వహిస్తున్నారనే పక్క సమాచారంతో జిల్లా ఎస్పీ సింధు శర్మ పేకాట స్థావరంపై దాడులు నిర్వహించాలని ఆదేశించడంతో ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్ పెక్టర్ రవీందర్ నాయక్ , స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అధిక మొత్తంలో రెండు లక్షల నాలుగు వేల పైబడి రూపాయలు, 5 కార్లు , ఒక బైక్ 10 సెల్ ఫోన్ లు స్వాధీనం పరుచుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. పేకాట లో పట్టుబడిన వారిలో పిట్లం మాజీ ఎంపీపీ భర్త భోగం విజయ్ , పెద్ద కోడప్ గల్ మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి , లతో పాటు , రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం.