– రోహిత్ వేముల కేసుపై పునర్విచారణ త్వరగా పూర్తి చేయాలి
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల కేసులో పోలీసుల నివేదిక ఆధారంగా నిందితులకు క్లీన్‌చిట్ లభించడం విస్మయం కలిగిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో వీసీ, ఏబీవీపీ నాయకుల వేధింపుల కారణంగానే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నట్టు స్పష్టమైందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయినప్పటికీ నిందితులకు అనుకూలంగా పోలీసు నివేదిక ఉండడం దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. దాని ఆధారంగా హైకోర్టులో నిందితులకు విముక్తి కల్పించడం అసంతృప్తి కలిగిందని తెలిపారు.