
నిజామాబాద్ ఖలీల్ వాడికి చెందిన సయ్యద్ సాజిద్ అలీ అనే వ్యక్తి వద్ద 1250 గ్రాముల గంజాయి, పదివేల రూపాయల నగదు స్వాధీన పరుచుకొని జైలుకు పంపించడం జరిగినది అని నిజామాబాద్ నగర సిఐ నరహారి శుక్రవారం తెలిపారు. నిజామాబాద్ నగర సిఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం నిన్న అనగా గురువారం సాయంత్రం సాయంత్రం చంద్రశేఖర్ కాలనీ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నారని నమ్మకమైన సమాచారం మేరకు పట్టణ సీఐ నరహరి, మూడవ పట్టణ ఎస్ఐ ప్రవీణ్ మరియు వారి సిబ్బంది అప్సర్ షౌకత్ ఆలీ గంగ కుమార్ లీలా కృష్ణ లు కలిసి అట్టి ప్రదేశానికి వెళ్లి నిందితుడిని అదుపులో తీసుకొని 1250 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసుకుని ఈరోజు కోర్టు యందు హాజరు పరచడం జరిగినది. ఇట్టి సాజిద్ అలీ అనే అతను మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన ఆనిస్ అను వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి నిజామాబాదులోని యువతకు మరియు కొంతమంది వ్యక్తులకు 200 కు ఒక ప్యాకెట్ చొప్పున అమ్మి జల్సా లకు పాల్పడుతున్నటువంటి సయ్యద్ సాజిద్ అను వ్యక్తిని అదుపులో తీసుకొని అతని వద్ద 1250 గ్రాముల గంజాయిని, 10 వేల రూపాయల నగదును మరియు ఒక ద్విచక్ర వాహనం ను స్వాధీనం పరుచుకొని అరెస్టు చేసి కోర్టుయందు హాజరు పరచడం జరిగింది.