అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యన్ని పట్టుకున్న పోలీసులు 

– వాహనం సీజ్, డ్రైవర్, రైస్ మిల్ యజమాని రిమాండ్ 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని బుధవారం వన్ టౌన్ పోలీస్ లు పట్టుకున్నారు. వన్ టౌన్ సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం  నల్గొండ పట్టణంలో ని చుట్టూపక్కల గ్రామాలలో వైట్ రేషన్ కార్డ్ దారులనుండి 9 రూపాయల చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేసి ఆక్రమం గా హైదరాబాద్లోని కోళ్ల ఫారంలకి తరలిస్తుండగా సమాచారం రావడంతో లోడ్ తో ఉన్న డీసీఎం నెం TS31-T-1512 ని అందులో ఉన్న 300 బస్టాల (15 టన్నులు) బియ్యాన్ని సీజ్ చేశాము. డీసీఎం డ్రైవర్  మునుకునూతల బిక్షం తండ్రి రాములు, వయస్సు 39 సం. నివాసం చైతన్యపురి కాలనీ, నల్గొండ, అదేవిధంగా వెంకటరమణ రైస్ మిల్ యజమాని  బండారు రాజు తండ్రి మల్లయ్య, వయస్సు 45 సం. నివాసం పానగల్ నల్గొండ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు.