అనుమానస్పదంగా తిరిగే వారి గురించి పోలీసులకు తెలియజేయాలి

– ఎవ్వరూకూడా వారిని కొట్టరాదు
– అలా కొట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడును
– పోలీస్ కమీషనర్ వెల్లడి
నవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ఎవరయిన అనుమానస్పదంగా సంచరిస్తున్నారని తెలిసి లేదా ఎవ్వరినైన దొంగలు అని అనుమానించిన లేదా గుర్తుతెలియని వారు అనిపిస్తే వారి గురించి సమాచారాన్ని దగ్గరలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు లేదా 100 టోల్ ఫ్రీ ఎమర్జెన్సీ నెంబర్ కు తెలియజేయాలి. ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలో కొంత మంది అనుమానంతో తిరుగుతున్న వారిని పట్టుకొని చట్టాన్ని చేతిలోకి తీసుకొని వారిని కొట్టడం వలన తీవ్రగాయాలు పొందినారు.  రెండు సంఘటనలలో చనిపోయినారు. ఇలాంటి సంఘటనల పై పోలీసు వారు కేసు నమోదు చేయడం జరిగింది. కొట్టిన వారిని జైలు కు పంపడం జరిగింది అని నిజమాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. కావున పోలీసు వారు విజ్ఞాప్తి చేస్తునది ఏమనగా ఎవరయిన అనుమానసస్పదంగా కనిపించి నట్లయితే వెంటనే 100 టోల్ ఫ్రీ ఎమర్జెన్సీ నెంబర్కు (లేదా) స్థానిక  పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగలరు.ఎవ్వరు చట్టాన్ని చేతులోకి తీసుకొని అనుమానస్పద వ్యక్తుల పై దాడి చేయోద్దని కోరుతున్నాము.ఎవ్వరయిన దీనికి వ్యతిరేకంగా దాడిచేసిన లేదా కొట్టినట్లయితే అటువంటి సంఘటనల పైన చట్ట పరమైన చర్యలు తీసుకోబడును అని కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ కల్మేశ్వర్ సింగెనవర్, ఐ.పి.యస్ తెలియజేశారు.