వడ్డీ వ్యాపారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి 

– బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ విజ్ఞప్తి
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రజల ఆర్థిక బలహీనతలను ఆసరాగా చేసుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తున్నారని బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ ఆరోపించారు.ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. దిగువ ఎగువ మద్యతరగతి ప్రజలు తమ పిల్లల పెళ్లిళ్లు, చదువు, హాస్పిటల్ వైద్య ఖర్చుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే అదే అదునుగా భావించిన వడ్డీ  వ్యాపారుల కోట్ల విలువైన ఆస్తులను లక్షలకు సెల్ డిడ్ చేసుకో తీరా విలువైన ఆస్తులను కాజేయ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో వినాయక్ నగర్ కు చెందిన వడ్డీ వ్యాపారి వద్ద ఒక ప్రైవేట్ ఉద్యోగి కోటిన్నర రూపాయల  విలువైన ఇల్లును, యాబై లక్షల రూపాయలకు సెల్ డిడ్ చేయించారు. దీనికి మూడు రూపాయల వడ్డీ నెలకు ఇస్తున్నారు. అయితే ఆ ఇంటిపై కన్నేసిన వడ్డీ వ్యాపారి ప్రైవేట్ ఉద్యోగిలేని సమయంలో వృద్ధ తల్లి తండ్రులను పచ్చి బూతులు తిట్టి ఇంట్లోని వస్తువులను బయటికి  విసిరే చేస్తానని కిరాయి వాళ్ళను సైతం ఇంటిని కాలి చేయాలని బెదిరించారు.దీంతో సదరు  ప్రైవేట్ ఉద్యోగి సుభాష్ నగర్ లోగల బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి కార్యాలయానికి వచ్చి తన గోడును వెల్లగక్కెతే గత మూడు రోజుల క్రితం నగర ఏసిపి గారికి, నాల్గవ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కావున జిల్లా పోలీసు యంత్రాంగం వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఎల్ పి జిల్లా కన్వీనర్ కె.మధు, నగర్ కన్వీనర్ టి.రాజు, నాయకులు గోవింద్ లు పాల్గొన్నారు.