అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పోలీస్ లు

నవతెలంగాణ – అశ్వారావుపేట : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టరు ను ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక అదనపు ఎస్సై శివరామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మామిళ్లవారిగూడెం సమీపంలో గల వాగు నుంచి అశ్వారావుపేట కు ఇసుక అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని, ఇసుక తరలిస్తున్న వనమా నాగరాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే పట్టుబడిన ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్లు ఎస్సై చెప్పారు