– పల్స్ ఫోలియో కార్యక్రమాన్ని ప్రారబించిన ఎంపిపి మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
పోలియో నిర్ములన అందరి బాధ్యతని, నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలని మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఎంపిపి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడారు పోలియో మహమ్మారిని అంతమందించేందుకు ఆరోగ్యశాఖ ద్వారా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పిల్లలు నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో కీలకమన్నారు. పోలియోను శాశ్వతంగా నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తామన్నారు. పోలియో నిర్మూలనకు వైద్య ఆరోగ్యశాఖకు సహకారం అందిస్తూ ఈ మూడు రోజులపాటు ప్రచారం చేసి 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో చుక్కలు వేయడానికి మండల వ్యాప్తంగా 22 ప్రత్యేక కేంద్రాలు, ఒక మొబైల్ టిమ్, ట్రాన్సీస్టర్ పాయింట్ ఒకటి, 88 మంది సిబ్బందిని ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిందన్నారు తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా కేంద్రాల వద్దకు వెళ్లి పిల్లల్ని తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలన్నారు.మండలంలో 0 నుంచి 5లోపు పిల్లలు 1591 ఉన్నారని, మొదటిరోజు 1550 మంది పిల్లలకు 98 శాతం వేసినట్లుగా మిగతవారికి రెండు రోజుల్లో పూర్తి చేయునట్లుగా తాడిచెర్ల ప్రాథమిక వైద్యాధికారి రాజు తెలిపారు.