నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రభుత్వ పథకాలు గ్రామాలలో అమలు చేయాలని ఏర్పాటు చేస్తున్న ప్రజాపాలన గ్రామసభలలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, ప్రభుత్వ పథకాల అమలలో కాంగ్రెస్ నాయకుల జోక్యం ఉండకూడదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం మందోల్లగూడెం గ్రామంలో స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో మందోల్లగూడెం, సింగరాయ చెరువు, తూర్పుగూడెం గ్రామాలలో నెలకొన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ రాగిరి కిష్టయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రభుత్వ పథకాలను పేదలకు అందించాలని ప్రజా పాలన గ్రామసభలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలనలో అర్హులైన వారికి ఇండ్లు ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, రైతుబంధు, రైతు భరోసా మొదలగు అంశాలు అమలు అయ్యే విధంగా బాధ్యత తీసుకోవాలని వారు అన్నారు.
అదేవిధంగా గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల జోక్యం పెరిగి అర్హులకు కాకుండా ఇస్తానుసారంగా ప్రభుత్వ పథకాల అమలును ప్రోత్సహిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్ నాయకుల జోక్యం ఉండకుండా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందెల అధికారులు చొరవ చూపాలని వారు అన్నారు. స్థానికంగా కుక్కలు కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని, గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, బొమ్మలకుంట నుండి సింగరాయ చెరువులకు కాల్వ వెడల్పు చేయాలని, మందోల్లగూడెం పాఠశాల నుండి పర్యబాయి వరకు బ్యూటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, బీసీ కమ్యూనిటీ హాల్ కు నిధులు కేటాయించి భవనాన్ని పూర్తి చేయాలని, నీల అంజయ్య ఇంటి నుండి పెద్ద కొండూరు వరకు వీటి రోడ్డు నిర్మాణం చేయాలని, ఎన్ జి ఆర్ ఐ కుంట నుండి బీరప్ప కుంట వరకు పిల్ల కాలువ నిర్మాణం చేయాలని, మందొల్ల గూడెం ప్రైమరీ పాఠశాలలో వంటగది నిర్మించాలని, స్థానిక పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ బోరెం నర్సిరెడ్డి మందొల్లగూడెం శాఖ కార్యదర్శి కొండ శ్రీశైలం మాజీ ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేశం మండల కార్యదర్శివర్గ సభ్యులు చీర్క సంజీవరెడ్డి, చింతల సుదర్శన్, తడక మోహన్, పొట్ట శ్రీను, మండల కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, నాయకులు ఇట్టబోయిన శేఖర్, చిర్క అలివేలు సప్పిడి రాఘవరెడ్డి, మంద బుచ్చిరెడ్డి కస్తూరి లింగస్వామి కొండే నరసింహ యాట బాలరాజు సప్పిడి శ్రీనివాస్ రెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, పాపగల శంకరయ్య, యాట ముత్యాలు, వల్లూరి వెంకటేశం, కూరెల్ల నర్సిరెడ్డి, సప్పిడి నరేందర్ రెడ్డి, నీల అంజయ్య, పాపగళ్ళ లింగస్వామి, కొండే స్వరాజ్యం, శివ, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.