– ముందు నామినేషన్ల స్వీకరణ..
– ఓటు హక్కు ప్రాముఖ్యతపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన..
నవతెలంగాణ – కుభీర్
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పల్సి విద్యా భారతి పాఠశాల యందు విద్యార్థులకు ఎన్నికల పోలింగ్ పటిష్ట భద్రతల మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి కనుగునంగా విద్యార్థుల నాయకత్వం లక్షణాలు, ఓటు హక్కు దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థుల్లో సంపూర్ణ అవగాహన కల్పించడం కోసం ఈ పోలింగ్ నిర్వహించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాసింగ్ తెలిపారు. ఎన్నికల నియమనిబంధనలకు అనుగుణంగా గత రెండు రోజుల ముందు నామినేషన్ల స్వీకరణలో 11మంది అభ్యర్థులు నామినేషన్ ల బరిలో ఉండగా ఇద్దరు అభ్యర్థులు ఉప సంవరించుకోవడంతో ఆ నంతరం అభ్యర్థులు గ్రామంలో ప్రచారం నిర్వహించి పాఠశాలలో నిజంగా ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతూ ఈ ఎన్నికలు సజవుగా జరిపినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మధుసూదన్ తెలిపారు.ఎన్నికల ఫలితాలలో ఏ. మధుశ్రీ, పుస్తకం గుర్తుతో 80 ఓట్లతో విజయం సాధించగా రెండవ స్థానంలో విజిల్ గుర్తు అభ్యర్థి ఎన్. రామ్ తేజ్ నిలిచారు. గెలిచిన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసి విద్యార్థుల అభ్యున్నతికి తనవంతుగా పాఠశాలలో కృషి చేస్తానని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. పాఠశాలలో జరిగిన ఎన్నికలనలో పాఠ్యపుస్తకం గుర్తు గెలవడం అనేటువంటిది విద్యార్థులకు, పుస్తకం యొక్క ఆవశ్యకత గురించి మరోసారి తెలియజేసినట్లు అయ్యిందని గెలుపోటములు సహజమని ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డి. పోతన్న, వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ, ఉపాధ్యాయులు భోజన్న, ప్రవీణ్, రాజు, సాయినాథ్, రాజు, దేవకి, అస్మిత, గంగామణి, నేహా, శృతిక, వైష్ణవి, గాయత్రి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.