హుస్నాబాద్ లో పోలింగ్ ప్రశాంతం

– నియోజకవర్గంలో  77.81% శాతం నమోదు
-అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు 
-పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే సతీష్
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ : అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో గురువారం హుస్నాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హుస్నాబాద్ పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 77.81 శాతం నమోదు అయ్యింది. హుస్నాబాద్ లో ఇలాంటి మంచినీయ సంఘటనలు చేసుకోకుండా హుస్నాబాద్ ఏసిపి సతీష్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమస్య లేకుండా పర్యవేక్షణ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోనీ పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించి పోలింగ్ తీరను పర్యవేక్షించారు.