పోలింగ్ మెటీరియల్ ను నల్గొండ స్ట్రాంగ్రూ మ్ లో  అప్పగించాలి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పోలింగ్ మెటీరియల్ బందోబస్తు మధ్య జాగ్రత్తగా నల్లగొండ స్ట్రాంగ్ రూమ్ లో  అప్పగించాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే సూచించారు. సోమవారం నాడు సాయంత్రం ఆయన వరంగల్ -ఖమ్మం -నల్లగొండ పట్టభద్రుల నియోజక వర్గ ఉప ఎన్నిక పోలింగ్ పురస్కరించుకొని రాయగిరి లోని విద్యాజ్యోతి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ ను డిప్యూటీ పోలీసు కమీషనర్ రాజేశ్ చంద్రతో కలిసి సందర్శించారు. పోలింగ్ కేంద్రాల నుండి వచ్చే పోలింగ్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ జాగ్రత్తగా పరిశీలించి తీసుకొని తిరిగి అనంతరం వాటిని పూర్తి బందోబస్తు మధ్య జాగ్రత్తగా నల్లగొండ లోని ఎఎంసి గోదాము స్ట్రాగ్ రూములో అప్పగించాలని భువనగిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ అమరేందర్ కు సూచించారు.