లడఖ్ : కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో ఐదుగురు ఓటర్ల కోసం ప్రత్యేకంగా వారి నివాసం దగ్గరలోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ పోలింగ్‌లో భాగస్వామ్యుల్ని చేసేలా చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారి మరల్కర్ తెలిపారు. లే జిల్లా ప్రాంతానికి మారుమూల 170 కి.మీ దూరంలోని వాషీ గ్రామంలో ఓ రైతు కుటుంబం నివసిస్తోంది. వారిలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళా ఓటర్లు ఉన్నారు. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉండే కార్గిల్, బౌద్ధులు అధికంగా ఉండే లేV్‌ా జిల్లాలు ఉన్నాయి. మొత్తం 1,82,571 మంది ఓటర్లలో 91,703 పురుషులు, 90,868 మంది మహిళా ఓటర్లున్నారు. 577 పోలింగ్ కేంద్రాలను ఇసి ఏర్పాటుచేస్తుండగా వాటిలో 33 పట్టణ, 544 గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో చాలా ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా ఎన్నికల సామాగ్రిని, సిబ్బందిని తరలించనున్నారు