చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు

 –  మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– నా చెత్త నా బాధ్యత గోడపత్రిక ఆవిష్కరణ
 నవతెలంగాణ నల్లగొండ కలెక్టరేట్ 
చెత్తను వేరు చేసి రీసైకిలింగ్ చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందడంతోపాటు, భూమి, నీటి,  వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శుక్రవారం నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో  WOW ITC, MAARI నల్గొండ మున్సిపాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో చెత్తను వేరు చేసే పద్ధతులు, ఆ చెత్త ద్వారా ఆదాయాన్ని సంపాదించే పద్ధతులపై  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్గొండ మున్సిపాలిటీలో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నందుకు ఐటిసి ప్రతినిధును మంత్రి అభినందించారు. చాలా మంచి కార్యక్రమమని,  చాలా లాభాలు ఉన్నాయని, మున్సిపల్ కార్మికులకు వేతనంతో పాటు, దీని ద్వారా అదనపు ఆదాయము సమకూర్చుకునే అవకాశం ఉందని, కార్యక్రమం విజయవంతం కావడానికి తన వంతు పూర్తి సహకారం, సమయం కేటాయిస్తానని చెప్పారు. అనంతరం నా చెత్త నా బాధ్యత అనే పేరుతో చెత్తను వేరు చేయడం వల్ల కలిగే సానుకూల ప్రభావాలు, ఉపయోగాలతో కూడిన  గోడపత్రికను కలెక్టర్ హరిచందన తో కలిసి ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడుతూ   ప్రస్తుతానికి తడి, చెత్త  పొడి చెత్త వేరు చేస్తున్నప్పటికీ  వాటిని సక్రమ  పద్ధతిలో  వేరు చేసి రీసైక్లింగ్ చేయడం వల్ల కలిగే ఉపయోగాలను  తెలిపారు. చెత్తను సేకరించడం, రీసైకిలింగ్ చేయడంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉందని, అక్కడ చెత్తను సేకరించడానికి ప్రతి ఇంట్లో నాలుగు చెత్త డబ్బాలు ఉంచుతారని, ఎక్కడికి అక్కడ గ్రేడింగ్ చేసి రీసైక్లింగ్ చేయడంలో  ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. నల్గొండ పట్టణాన్ని  సైతం దేశంలో నెంబర్ వన్ స్థానం  పొందెలా ప్రతి ఒక్కరూ  అవగాహన చేసుకుని కష్టపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, నల్గొండ ఆర్డీవో రవి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, ఐటీసీ ప్రతినిధి ఉమాకాంత్, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మండల నాయకులతో పాటు, అధికారులు మున్సిపల్ రీసెర్చ్ పర్సన్లు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.