
నవతెలంగాణ – వేములవాడ రూరల్: వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం పాలిటెక్నిక్ విద్యార్థులు జిల్లా స్థాయిలో క్రీడల్లో ప్రతిభను కనబరిచి బహుమతులను గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పాలిటెక్నిక్ కళాశాల పోటీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల లో ఈనెల 22 ,23 తేదీల్లో నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల నుండి 450 మంది పైగా విద్యార్థిని, విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఆదివారం గెలుపొందిన విద్యార్థులను అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి రాజగోపాల్ అభినందించారు. వివిధ క్రీడల్లో రాణించిన కబడ్డీ చెస్ లో అభిరామ్, లాంగ్ జంప్ లో దేవేందర్ ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. 100 మీటర్లు ,200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగు విభాగంలో, వాలిబాల్ లో రన్నర్ అప్ గా నిలిచారు. బాలికలు హై జంపు లో రెండవ స్థానం లో నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజగోపాల్ మాట్లాడుతూ కళాశాలలో చదువుతోపాటు క్రీడలు విద్యార్థిని విద్యార్థులకు చాలా మానసిక ఉత్తేజం శరీరపుష్టి మేధాశక్తి పెంపొందుతుందని అన్నారు. చదవాలి గెలవాలి అని పట్టుదల విద్యార్థుల్లో కలుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను కళాశాల శాఖాదిపతులు శ్రీదేవి, రవికుమార్, ప్రభాకరాచారి, సయ్యద్ శహభాష్, కృష్ణ మనోహర్, ధశరథ౦ , కళాశాల అధ్యాపకులు నరేష్, శ్రీలేఖ, భవాని ఫిజికల్ డైరెక్టర్ అజయ్ లు అభినందించారు.