చెరువు భూములను కాపాడాలి

Pond lands should be protectedనవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న చెరువు భూములను, చెరువు, శిఖం భూములు  మత్తడికి సంబంధించిన భూములను కాపాడాలని, జన్నారం మండల చెరువుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కమ్మల విజయ్ ధర్మ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో  తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డికి  దరఖాస్తు పత్రాన్ని అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ  అన్ని గ్రామాల్లో ఉన్న శిఖం చెరువు భూములకు సంబంధించిన, పత్రాలను దస్తావేజులను,  జిరాక్స్ కాపీలతో కమిటీకి ఇవ్వాలని కోరారు. చెరువులు కబ్జా కాకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో, కమిటీ గౌరవాధ్యక్షులు భూమా చారి, ప్రచార కార్యదర్శి మామిడి విజయ్, నాయకులు ఎండి ఇజాజ్, ఎస్ మహేష్ దాసరి తిరుపతి, కొండపల్లి మహేష్, ఒరే సాయికుమార్, ప్రభంజనం, తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.