
– వాగొడ్డుగూడెం వంతెనపై నిలిచిన రాకపోకలు..
– నియోజక వర్గంలో వర్షపాతం 220.6 మి.మి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
గతం రెండు రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజక వర్గంలో చెరువులు,కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టుకు వరద నీరు చేరింది.19 అడుగులు నీటి సామర్ధ్యం గల ఈ ప్రాజెక్ట్ లోకి 9 అడుగులు వరద నీరు చేరింది అని ఐ.బి ఎఇ కె.ఎన్.బి క్రిష్ణ తెలిపారు. అశ్వారావుపేట – వాగొడ్డుగూడెం రోడ్డు లో వాగొడ్డుగూడెం సమీపంలోని వంతెన పైకి వరద నీరు ప్రవహించడంతో స్థానిక సర్పంచ్ సాధు జ్యోత్స్న బాయి,ఎస్.ఐ రాజేష్ కుమార్ వరద పరిస్థితిని పరిశీలించి ఆ దారిలో రాకపోకలు నిలిపివేసారు.
శుక్రవారం అధికారులు తెలిపిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
శుక్రవారం అధికారులు తెలిపిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మండలం వర్షపాతం మీ.మీ.
అశ్వారావుపేట 33.6
దమ్మపేట 43.4
ములకలపల్లి 53.2
అన్నపురెడ్డిపల్లి 49.8
చండ్రుగొండ 40.6
మొత్తం 220.6