నవతెలంగాణ హైదరాబాద్: డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ (DICV), డైమ్లర్ ట్రక్ ఏజీ (‘‘డైమ్లర్ ట్రక్’’) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ కాగా, జులై 1, 2024 నుంచి జారీలోకి వచ్చేలా బస్ బిజినెస్ హెడ్‌గా అందముత్తు పొన్నుసామిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. అందముత్తు పొన్నుస్వామి 2011లో డీఐసీవీతో తన ప్రయాణాన్ని ప్రారంభించగా, ఆటోమోటివ్ (ప్యాసింజర్ మరియు కమర్షియల్ వెహికల్) పరిశ్రమలో కార్యకలాపాల నిర్వహణలో ప్రత్యేకతలతో 35 ఏళ్లకు పైగా అనుభవాన్ని కలిగి ఉన్నారు.
డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సత్యకం ఆర్య మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో బస్ పరిశ్రమ సుస్థిర వృద్ధిని సాధిస్తోంది. ఈ మధ్య కాలంలో వృద్ధి సాధిస్తున్న వాణిజ్య వాహనాల (CV) పరిశ్రమ పరిమాణంలో కీలక భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉండగా, ఇందులో బస్సుల విభాగం ఒక కీలక పాత్రను పోషిస్తోంది. మా వ్యాపారంలో భాగమైన బస్సు వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో మా సంస్థలో అత్యంత సమర్థుడైన వ్యక్తి అందముత్తు. మా ఉత్పత్తి ఆవిష్కరణ, కార్యాచరణ శ్రేష్ఠతపై దృష్టి సారిస్తూ వ్యూహాత్మక కార్యక్రమాల అభివృద్ధితో బస్సు వ్యాపారాన్ని ఆయన ముందుకు తీసుకువెళతారని నాకు నమ్మకం ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రముఖ వైవిధ్యమైన తయారీ బృందాలలో నైపుణ్యం, గత దశాబ్దంలో కంపెనీ వృద్ధికి కీలకమైన కార్యాచరణ నైపుణ్యం, వ్యయ నిర్వహణపై ఆయన దృఢమైన గ్రహణశక్తితో డీవీసీవీ ట్రక్ అసెంబ్లీ కార్యకలాపాలను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. అదే క్రమంలో 2016లో, ఆయన క్యాబ్ ప్రొడక్షన్ మరియు ట్రక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ అయ్యారు. డీఐసీవీ ట్రక్ కార్యకలాపాలలో కార్యాచరణ నైపుణ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచారు. ముఖ్యంగా, భారతదేశంలో నియంత్రణ అమలు సమయంలో భారత్‌బెంజ్ బీఎస్6 (BS6) ట్రక్ శ్రేణి ఎండ్-టు-ఎండ్ కార్యాచరణ ప్రణాళిక మరియు అమలుకు నాయకత్వం వహించారు. పి అందముత్తు 2021లో, బస్ ప్రొడక్షన్ హెడ్‌గా నియమితులయ్యారు. ట్రక్ క్యాబ్ ప్రొడక్షన్ హెడ్‌గా తన విధులతో పాటుగా బస్సు వ్యాపారాన్ని ట్రక్ కార్యకలాపాలతో విజయవంతంగా ఏకీకృతం చేసినప్పుడు, పూర్తిగా నిర్మించిన బస్సుల సామర్థ్యాన్ని పెంచడానికి నాయకత్వం వహించి, ఉత్పత్తులను గణనీయంగా వృద్ధి చేసేందుకు శ్రమించారు. వ్యూహాత్మక కార్యక్రమాలు, సేకరణ, తయారీ మరియు ఇంజినీరింగ్ బృందాలతో సహకారాన్ని పెంపొందించడం ద్వారా బస్సు ఉత్పత్తిలో ఖర్చు ఆదా కోసం ఆయన నిరంతర ప్రయత్నాలు చేశారు.
తన నియామకం గురించి డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ బస్ బిజినెస్ హెడ్ అందముత్తు పొన్నుసామి మాట్లాడుతూ, ‘‘డీఐసీవీలో బస్సు వ్యాపారానికి అధికారిగా ఎంపిక కావడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. మా గ్లోబల్ డీఎన్ఏ మరియు మేము ఇక్కడ నిర్మించిన బలమైన పునాదితో, గత దశాబ్దంలో డీఐసీవీలో, మేము ఈ ఉత్తేజకరమైన వృద్ధి కాలాన్ని నావిగేట్ చేస్తున్నప్పుడు, బస్సు పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని సాధిస్తామని మరియు పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పుతామని నేను విశ్వసిస్తున్నాను. మా పోటీతత్వానికి మరింత పదును పెట్టడం, స్థిరమైన అభివృద్ధికి దోహదపడడం నా ప్రాధాన్యత. భారత్ బెంజ్ బస్సులు, మరియు మా వినియోగదారులు మరియు వాటాదారులకు విలువను అందజేస్తాయి’’ అని పేర్కొన్నారు.
గత దశాబ్దంలో, డీఐసీవీ వాణిజ్య వాహన పరిశ్రమలో భద్రత మరియు సామర్థ్యం కోసం ఉన్నత ప్రమాణాలను నెలకొల్పింది. పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న యాజమాన్యం ఖర్చులను తగ్గించే అంశంలో గుర్తింపు దక్కించుకుంది. భారత్ బెంజ్ బస్సులు విశ్వసనీయత, సౌకర్యం మరియు భద్రతకు పర్యాయపదంగా మారాయి. అదే విధంగా 2023లో, కంపెనీ ఒక్క ఏడాదిలోనే 1,000కి పైగా పూర్తి-నిర్మిత బస్సులను విడుదల చేసింది. ఇది సంస్థ శ్రేష్ఠతకు, మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లను పరిష్కరించే సామర్థ్యాన్ని చూపుతుంది. భారత్ బెంజ్ బ్రాండ్ ఫోకస్ రవాణా రంగంలో స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుండగా, అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని నిర్ధారించే అత్యుత్తమ-నాణ్యత ఉత్పత్తులను అందించడంపైనే ఉంది.