న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఐపీఎల్ 2025 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్ చీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ యాజమాన్యంతో నాలుగేండ్ల కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఏడు సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చీఫ్ కోచ్‌గా పని చేసిన రికీ పాంటింగ్ మూడు సీజన్లు ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చారు. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తుండగా.. పాంటింగ్ శిక్షణ సారథ్యంలో సరికొత్త పంజాబ్ కింగ్స్‌ను చూస్తారని ఆయన అన్నారు.