నవ తెలంగాణ- వెల్డండ:
వెల్దండ మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో యాదవుల కుల దైవం పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుదవారం పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోరటి శ్రీనివాస్, ఎంపిటిసి చక్రవర్తి , కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ సంజీవ్ యాదవ్, జియాగూడ అధ్యక్షులు జక్కుల జంగయ్య యాదవ్ మాజీ ఉప సర్పంచ్ నెంట రాజు లు భూమి చేసి ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు కాగుల మల్లేష్, కుల పెద్దలు అయ్యన్న, చంద్రయ్య, అంజయ్య, వెంకటయ్య, శ్రీను, బాలరాజ్, వార్డు సభ్యులు ప్రసాద్, మల్లేష్, శివరాం, సాయి, యాదయ్య, రఘ వెందర్ తదితరులు ఉన్నారు.