
బీఆర్‌ఎస్ పార్టీ ములుగు అసెంబ్లీ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపును ఆకాంక్షిస్తూ ప్రతి గ్రామంలో గ్రామ దేవతలకు బొడ్రాయిలకు శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ మండల కమిటీ తీర్మానం మేరకు శనివారం 18 గ్రామ పంచాయతీల పరిధిలో ఆయా గ్రామాలలో ఉన్న గ్రామ దేవతలకు బొడ్రాయిలకు నాగజ్యోతి గెలుపును ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాలు ఆయా గ్రామ కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. మండల కేంద్రంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకినపల్లి రమేష్, చల్వాయి గ్రామంలో నాం పూర్ణ చందర్, పసరలో తాటికొండ శ్రీనివాసాచారి, మచ్చాపురంలో వంగరి ప్రభాకర్, రాంనగర్ సుమన్, బాలాజీ నగర్ గాంధీ, రాఘవపట్నం నాగేశ్వరరావు, పాపాయిపల్లి సర్పంచ్ రాకేష్ తదితరుల ఆధ్వర్యంలో బొడ్రాయి పూజా కార్యక్రమాలను నిర్వహించి బీఆర్‌ఎస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట గ్రామ కమిటీ డాక్టర్ హేమాద్రి ఎన్ నరేందర్ జె రామారావు భూక్య దేవా తలసిల వెంకన్న సూరనేని శ్రీనివాసరావు ఎస్ రవీందర్రావు ఈ మోహన్ రెడ్డి జి ధర్మయ్య ఎన్ గాంధీ జి అజయ్ బి కోటయ్య ఇంద్రారెడ్డి కె రాంబాబు కే హరిబాబుచల్వాయి లో అధికార ప్రతినిధి బూరెటి మధు సర్పంచ్ ఈసం సమ్మయ్య బొల్లం ప్రసాద్ చల్వాయి గ్రామ రైతు కోఆర్డినేటర్ కే కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు డి సంజీవ కనకయ్య జి ఎస్ రామ్ రెడ్డి జి శ్యామ్ వెంకన్న డి యాదయ్య ఏ శ్యామ్ పి రమేష్ ఆర్ సమ్మయ్య ఎం రవి జి చంద్రమౌళి ఎం సతీష్ కనకయ్య,బుస్సాపూర్ లో పాల్గొన్న నాయకులు.. సర్పంచ్ సింగం శ్రీలత ఈ సి చంద్రయ్య కే జీవన్ రెడ్డి బి సాంబయ్య బి రవి కె సంజీవ బి వెంకన్న బి కరుణాకర్ వి వాణి ఆనందం వి కళమ్మ పి రంజిత్ రెడ్డి బి అనూష తిరుపతమ్మ సుజాత రాధిక ఎస్ మున్వర్ అశోక్ బి రాం నగర్ పాల్గొన్న నాయకులు గోవిందరావుపేట యూత్ అధ్యక్షులు జన్ను రాంబాబు ఎస్ కృష్ణారావు కొంపెల్లి హరిబాబు ఎస్ రాజేందర్, భరత్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు యూత్ కమిటీ నాయకులు సోషల్ మీడియా వారియర్స్ మహిళలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యువతకు బడే నాగచైతక్క గెలుపే లక్ష్యంగా పూజలు చేశారు.