
సామాజిక విప్లవ కారులు, సంఘ సంస్కర్త, బడుగులకు విద్య ప్రదాత, బీసీల జాతి పిత మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్, వినాయక్ నగర్ వద్ద గల పూలే విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు బీసీ సంఘం నాయకులు గురువారం అర్పించారు. ఈ సందర్భం లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే కేవలం బడుగు బలహీనవర్గాలకె సేవ చేయలేదని గుర్తు చేశారు.వై సమాజంలో వెనుకబడిన ప్రతి ఒక్కరి గురించి పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మ జ్యోతిబాపూలే అని పేర్కొన్నారు. అగ్రవర్ణాల పేదలకు, వితంతువుల కొరకు, ఎస్సీ ఎస్టీ బిసి ఇలా ప్రతి జాతి కొరకు మరియు ప్రతి కులం వారి కొరకు పోరాడిన ఏకైక వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అని గుర్తు చేశారు. తన భార్యకు విద్యను నేర్పి తన భార్యను భారత దేశ ప్రథమ ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన గొప్ప దార్శనికుడు మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు. సమాజం బాగుపడాలంటే మహిళా చైతన్యం ముఖ్యమని, మహిళా చైతన్యం విద్యతోనే సాధ్యమని గ్రహించి ఆ విధంగా మహిళలకు విద్యను నేర్పించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు. మహిళలు బాగు పాడితే కుటుంబం బాగు పడుతుందని అని చెప్పి తన భార్య ద్వారా మహిళలకు విద్యను నేర్పిన విద్య ప్రదాత భారతదేశ ముద్దుబిడ్డ మహాత్మ జ్యోతిబాపూలే భారతదేశానికొక గొప్ప వరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కరిపే రవిందర్, మాడవేడి వినోద్ కుమార్, పోల్కం గంగాకిషన్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, లక్ష్మణ్ గౌడ్, కోడూరు స్వామి, బసవ రాజు, పాల్గొన్నారు.