పూలే వర్దంతిని అధికారికంగా నిర్వహించాలి

Poole's birthday should be formalizedనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
మహాత్మ జ్యోతి భాపూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం వర్థంతిని మాత్రం నిర్వహించడం లేదని అఖిల భారతీయ మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కూలే అన్నారు. గురువారం మాలీ సంఘం ఆధ్వర్యంలో పూలే వర్థంతిని పురస్కరించుకొని ఎస్సీ కార్యాలయ ఆవరణలోని పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2008లో అప్పటి ప్రభుత్వం, సీఎం వైఎస్ఆర్ పూలే వర్ధంతిని అధికారికంగా నిర్వహించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం జయంతిని మాత్రమే నిర్వహిస్తుందని సుకుమార్ పెట్కూలే అన్నారు. సమాజంలో రుగ్మాతలను దూరం చేయడంతో పాటు మహిళల చదువుకు ఆయన చేసిన కృషిని గుర్తిస్తు జయంతితో పాటు వర్థింతిని కూడా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వారు చేసిన సేవలను గుర్తిస్తు పూలే దంపతులకు సమూచి స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సాంబన్నషిండే, సతీష్, విజయ్, చంద్రశేఖర్, భాస్కర్, దేవిదాస్, స్వేరోస్ అధ్యక్షుడు పెంటపర్తి ఉశన్న పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ భవనంలో
బీసీ సంక్షేమ సంఘ భవనంలో పూలే వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మ జ్యోతిభాపూలే చిత్రపటానికి పూలామలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు మాట్లాడుతూ.. పూలే దంపతులను ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలన్నారు. అదే విధంగా సమసమాజ స్థాపనకు కృషి చేసిన ఫూలే కృషిని గుర్తించి వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కలల శ్రీనివాస్, అశోక్, ప్రశాంత్, శ్రీనివాస్, బండారి దేవన్న తదితరులున్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిభా పూలే వర్ధంతిని గురువారం నిర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలోని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యరంగంతో పాటు బాల్య వివాహాలపై ఆయన సేవలను నేతలు కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు గుడిపెల్లి నగేష్, రఫీక్, శ్రీధర్, చరణ్ గౌడ్, శ్రావణ్ నాయక్, శ్రీలేఖ పాల్గొన్నారు.