-అటీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ-గుండాల
ఆలేరు నియోజకవర్గ పేద ప్రజలకు ఆపద సమయంలో అండగా వుంటానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం ఆయన మండలంలోని తుర్కల షాపురం గ్రామంలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన నర్రాముల సోమన్న,అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చుక్క యాదయ్య,ప్రమాదశాత్తు తాటి చెట్టు పైనుండి కాలుజారి పడిన గీత కార్మికుడు పొన్నగాని నరేందర్ గౌడ్,మేకల కాపరులు ఉప్పుల సత్తయ్య,ఉప్పుల లింగమల్లు లకు చెందిన 34 మేకలు పిడుగు పాటుతో మతి చెందగా ఆయా కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరుపు యాదగిరి గౌడ్,గుండాల,ఆలేరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలూరి రాంరెడ్డి,కొండ్రాజు వెంకటేశ్వర రాజు,పీఏసీఎస్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్,ఎంపీటీసీ కొర్న నరేష్,మండల యూత్ అధ్యక్షుడు పొన్నగాని నారాయణ గౌడ్ నాయకులు కేమిడి రవికుమార్,ఆకుల ఆంజనేయులు, బోనాశి కొండయ్య, లింగస్వామి, రాజు, నాగన్న, నరేష్,రమేష్,నాగన్న ,శ్రీనాథ్,కుమార్,మహేష్,గణేష్, మధుపాల్గొన్నారు.గుడిసె కవర్లు పంపిణీ ఆలేరురూరల్ : మండలంలోని కొల్లూరు గ్రామంలో బయటి కమ్మరి కులస్తులకు గుడిసెలకు పైకప్పు కవర్లను గురువారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బయట కమ్మరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.